Prabhas’s Next High Budget Film || Prabhas || Pooja Hegde || Filmibeat Telugu

2019-05-17 3

Prabhas next film is periodic romantic drama that is directed by Radha Krishna Kumar. Film Nagar source said that, A set worth Rs 30 crores is currently erected in Hyderabad.
#prabhas
#radhakrishna
#saaho
#tollywood
#poojahegde
#uvcreations

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ ప్రాజెక్టులు చేయడంపైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ 'సాహో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'సాహో' మూవీతో పాటు ప్రభాస్ 'జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1970 కాలం నాటి కథతో సాగుతుందట. సినిమా కథ ప్రకారం యూరఫ్‌లోని కొన్ని రియలిస్టిక్ లొకేషన్లలో షూటింగ్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.